31 C
Hyderabad

మరోసారి హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదికను సస్పెండ్ చేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టకుండా చూడాలన్నారు.  ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేయాలని గతంలో కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ  పిటిషన్లపై  తదుపరి విచారణ అక్టోబర్లో చేపట్టనుంది.

తప్పులు చేశారో.. లేదో తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీ కాదు

తప్పులు చేశారో.. లేదో తేల్చాల్సింది మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కాదని హరీష్ అన్నారు.  అది తేల్చాల్సింది కోర్టులు, ప్రజలు అన్నారు. కాళేశ్వరం పై పీపీటీకి అవకాశం ఇవ్వట్లేదంటే అధికార పక్షం భయపడుతున్నట్లేనని పేర్కొన్నారు.

More articles

Latest article