బతుకమ్మ,ఏర్గట్ల; మండలం బట్టాపూర్,తడపాకల్,దొంచంద, గుమ్మిర్యాల, గ్రామాలలో శుక్రవారం తెలంగాణ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పర్యటించి అతి భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం వివరాలను అధికారులతో తెలుసుకున్నారు.రైతులకు పంట నష్టం ప్రాథమికంగా వివరాలు అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులకు తగు సూచన చేశారు. ఇట్టి సందర్భంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఏర్గట్ల మండలంలో ప్రాథమిక అంచనా ప్రకారం సోయా, వరి, పసుపు, అలాగే మొక్కజొన్న, పంట 660 ఎకరాలు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవా రెడ్డి,కోరి పెళ్లి లింగారెడ్డి, దోoచంద రవి రెడ్డి, ఆడెం గంగ ప్రసాద్,రేండ్ల రమేష్, బట్టాపూర్ బాలే శ్రీనివాస్, నరేందర్ యాదవ్,దయానంద్ గౌడ్,వెంకట్ రెడ్డి,మునీర్, రోక్కెడ సంజీవ్, జుంగల బిగ్ బాస్,దొబ్బల మహేష్,రేండ్ల రాకేష్,రేండ్ల సత్తయ్య,పాల్గొన్నారు.
