30.9 C
Hyderabad
Monday, August 3, 2026

వరద బాధితులకు అన్నదానం చేసే అవకాశం రావడం నా అదృష్టం

Must read

📰 Generate e-Paper Clip

  • గ్రామస్తులకు ఆహారాన్ని అందజేసిన డాక్టర్ కట్ట అశోక్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యి వరద తో అల్లాడుతున్న వాడి గ్రామస్తులకు ఒక్క రోజు ఆహారం అందించే అవకాశం రావడం నా అదృష్టమని డాక్టర్ అశోక్ అన్నారు. శుక్రవారం ధర్పల్లి మండలం హాన్నాజీ పెట్ గ్రామంలో ముత్యాల చెరువు తెగిపోవడంతో వాడి గ్రామంలోకి వరద నీరు ముచ్చెత్తింది. దీంతో గురువారం జిల్లా కలెక్టర్, సీపీ, రూరల్ ఎమ్మెల్యే సందర్శించి ముంపు గ్రామంలో ప్రజలను సురక్షిత గ్రామాలకు తరలించారు. కాగ వర్షం తగ్గడంతో గ్రామస్తులు ఇంట్లో బురద ను చెత్తను తొలగించడం కోసం ఇంటి బాట పట్టారు. మంచి నీరు లేక ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గ్రామ యువకులు డాక్టర్ అశోక్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఆహారం కోసం ఎనిమిది వేల రూపాయలతో భోజనం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మండల అద్యక్షులు చిన్న బాల్ రాజ్ మంచి నీరు అందజేశారు. ఎల్దుర్థి కుటుంబ సభ్యులు, సీతాయి పెట్ తాండ యువకులు సైతం సహాయం అందజేశారు. వాడి ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని సహాయం అందజేసిన డాక్టర్ అశోక్, రవి, బాల్ రాజ్ మిగితా వారందరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ నాయకులు, అధికారులు వచ్చి చూసి ఎలాంటి సహాయం చేయలేదని, మా సమస్యకు అర్థం చేసుకొని సహాయం చేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అద్యక్షులు జిన్నా సాయిలు, సంతోష్, లింగపురం సాయిలు, దండు నర్సయ్య, గ్రామస్తులు భాస్కర్, రాం చందర్, రమేష్,  సాగర్, శ్రీకాంత్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

I am fortunate to have the opportunity to donate food to flood victims

More articles

Latest article