వరద బాధితులకు అన్నదానం చేసే అవకాశం రావడం నా అదృష్టం

గ్రామస్తులకు ఆహారాన్ని అందజేసిన డాక్టర్ కట్ట అశోక్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యి వరద తో అల్లాడుతున్న వాడి గ్రామస్తులకు ఒక్క రోజు ఆహారం అందించే అవకాశం రావడం నా అదృష్టమని డాక్టర్ అశోక్ అన్నారు. శుక్రవారం ధర్పల్లి మండలం హాన్నాజీ పెట్ గ్రామంలో ముత్యాల చెరువు తెగిపోవడంతో వాడి గ్రామంలోకి వరద నీరు ముచ్చెత్తింది. దీంతో గురువారం జిల్లా కలెక్టర్, సీపీ, రూరల్ ఎమ్మెల్యే సందర్శించి ముంపు గ్రామంలో ప్రజలను సురక్షిత గ్రామాలకు తరలించారు. కాగ...