27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు, ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని, జాతీయ క్రీడ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. తెలుగు భాష మధురమైనది, అమృతం లాంటి భాషను అందరు గౌరవించాలని, దానిలో ఉన్న గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణా చారి తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆటలలో పాల్గొనాలని దానివల్ల మంచి మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని తెలిపాడు. పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు గంగాధర్, ప్రవీణ్ శర్మ, విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనాన్ని పద్యరూపాలలో కవిత రూపాలలో పిల్లలకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పద్యపఠన  పోటీలు,కథ పోటీలు,కవితా పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రసాద్, విజయ్,రాజనర్సయ్య, రాజేందర్,శ్రీనివాస్,గంగా మోహన్,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article