- తెగిన కన్నాపూర్ చెరువు కట్ట
లింగంపేట్, బతుకమ్మ : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా లింగంపేంట్ మండలంలోని కన్నాపూర్ గ్రామంలోని చెరువు కట్ట తెగి చెరువు ఖాళీ అయ్యింది. దీంతో పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కన్నా పూర్ -పోల్కంపేట్ చెరువు విస్తీర్ణం సుమారుగా 500 ఎకరాలు ఉంటుంది. చెరువు నిండు కుండాల ఉన్నసమయంలో చెరువు కట్ట తెగిపోవడం వలన కళ్ల ముందే చెరువు ఖాళీ అయ్యింది. చెరువు కింద ఉన్న పంట పొలాలు తీవ్ర నష్టం వాటిల్లింది. ఊరిలోకి వచ్చే రోడ్డు కూడా తెగిపోయింది. దీంతో రాకపోకలు నిలించిపోయాయి.
