27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లాలో భారీ వర్షాల పై ఎంపీ అర్వింద్ ఆరా

Must read

📰 Generate e-Paper Clip

 

. . .అధికారులు అప్రమత్తంగా ఉండండి

. . . బాధితుల ను పునరావాస కేంద్రాలకు తరలించండి

. . . కలెక్టర్ సీపీలకు ఫోన్ లో మాట్లాడిన ఎంపీ

 నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లాలో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అధికారులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలపై  గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ,సీపీ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. జిల్లాలోని సిరికొండ, ధర్పల్లి, ఇందల్ వాయి మండలాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్నాయని, చాలా గ్రామాలు నీట మునిగి పోయిన విషయాన్ని ఆయన కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకెళ్లారు. వినాయక చవితి పండుగ సెలవు దినమైన ప్పటికీ, అధికారులు బాధ్యత తొ పనిచేశారని, రానున్న రెండు రోజులు జిల్లాకు రెడ్ అలెర్ట్  ఉన్నందున ఇదే స్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరద బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి, కనీస సౌకర్యాలు అందించాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారులు ఆస్తి,పంట నష్టం పై నివేదిక అందజేసి, నష్టపరిహారంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కోరారు. నష్టపరిహారం పై తాను కూడా ముఖ్యమంత్రి కి లేఖ రాస్తానని, విపత్తు నిర్వహణపై హోం శాఖకి సైతం నివేదిస్తానన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ప్రజలు, అధికారులకు సహకరించాలని ఎంపీ అర్వింద్ కీలక సూచనలు చేశారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తినందున పరివాహక ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు గోదావరి పరిసర ప్రాంతాలకు  వెళ్ళకుండా ఉండాలని కోరారు. వినాయక చవితి దృష్ట్యా, మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

More articles

Latest article