27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మట్టి వినాయకుల తయారీ పోటీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిర్రాజ్ గవర్నమెంట్ కాలేజ్  నిజామాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “మట్టి వినాయకుల తయారీ పోటీ” ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా కాలేజీకి చెందిన విద్యార్థులు స్వయంగా మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. పి. రామ్మోహన్ రెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టి వినాయకులు పర్యావరణ రక్షణకు తోడ్పడతాయి. ఇటువంటి సుస్థిర పద్ధతులు భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగించడానికి దోహదపడతాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రిన్సిపాల్ రంగ రత్నం, విభాగాధిపతి రాజేష్, అధ్యాపకులు రాము, రంజిత్, డా. వెంకట రమణ, హన్మంద్లు, డా. రామస్వామి, డా. రామకృష్ణ, వినయ్ కుమార్, డా. రంజితా, డా. జయప్రసాద్ తో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Clay Ganesha making competition

More articles

Latest article