మట్టి వినాయకుల తయారీ పోటీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిర్రాజ్ గవర్నమెంట్ కాలేజ్ నిజామాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో "మట్టి వినాయకుల తయారీ పోటీ" ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీకి చెందిన విద్యార్థులు స్వయంగా మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. పి. రామ్మోహన్ రెడ్డి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మట్టి వినాయకులు పర్యావరణ రక్షణకు తోడ్పడతాయి. ఇటువంటి సుస్థిర పద్ధతులు భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన...