ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట తండా నాయక్ గా మాలోత్ సూర్య నాయక్, కారొబార్ గా భూక్యా హరిదాస్ నాయక్ లను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తండా వాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండావాసుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో భూక్యా పరశురాముల నాయక్, భూక్య బుచ్చియా నాయక్ , మాలోత్ రామచంద్ నాయక్, అజ్మీర బొజ్జ నాయక్,అజ్మీరా రాజు నాయక్ ఎన్ఆర్ఐ ,భూక్యా హరిచంద్ నాయక్,భూక్యా సునీల్ నాయక్ , అజ్మీరా రాజు నాయక్, మాలోత్ రామచంద్ నాయక్ ,మూడవత్ రాజు నాయక్ ,బాలు,అజ్మీరా మంగ్య,కిరణ్ నాయక్ ,రవి నాయక్ ,జవహర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
