భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని కుప్కల్ గ్రామానికి చెందిన హృద్రోగ భాధితుడు బాజం రమేష్ కుటుంబీకులకు బుధవారం రూ. లక్ష డెబ్భై వేల ఎల్ ఓ సీ ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. గుండె సంభందిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ చేరిన బాజం రమేష్ కు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య ఖర్చుల కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను స్థానికులు, కుటుంబీకులు సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.1,70,000 ఎల్ ఓ సీని మంజూరు చేయించారు. అట్టి ఎల్ ఓ సీ ని వారి కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బొదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అనంత రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్ర,నాయకులు పల్లె శేఖర్, కొరాడి లింబాద్రి, బొర్రన్న,నారాయణ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
