బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత

భీమ్ గల్, బతుకమ్మ :  మండలంలోని కుప్కల్ గ్రామానికి చెందిన హృద్రోగ భాధితుడు బాజం రమేష్ కుటుంబీకులకు బుధవారం రూ. లక్ష డెబ్భై వేల ఎల్ ఓ సీ ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. గుండె సంభందిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ చేరిన బాజం రమేష్ కు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య ఖర్చుల కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను స్థానికులు, కుటుంబీకులు సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ...