24.1 C
Hyderabad
Monday, August 3, 2026

కందారి మైసమ్మ 21వ వార్షికోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,  బోధన్: బోధన్ పట్టణంలోని ఉధ్మీర్ గల్లీలో కందారి మైసమ్మ మందిరం 21వ వార్షికోత్సవాన్ని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని అలంకరించి, ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అమ్మవారిని పూజించడం ద్వారా పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించామని తెలిపారు. కార్యక్రమంలో ఉధ్మీర్ నరసింహ, సిద్ధ వినయ్, చిరుకూరి శ్రీకాంత్, సిద్ధ నితిన్, సిద్ధ శ్రీకర్, కుప్పల లక్ష్మణ్, మాసుల సురేష్, ఉధ్మీర్ సాయిలు, శిరం సాయిలు, సిద్ధ పోతయ్యతో పాటు మహిళలు, ఉధ్మీర్ గల్లీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు.

Kandari Maisamma's 21st Anniversary

More articles

Latest article