బతుకమ్మ, బోధన్ : కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు, నుడా చైర్మన్ కేశవ్ వేణు జన్మదిన సందర్భంగా కల్దుర్కి కుర్మ సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని సంఘం సమస్యలను వివరించి, కల్దుర్కి గ్రామంలో బీరప్ప గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్దుర్కి కుర్మ సంఘం అధ్యక్షులు సిరిగిరి రామ్, సెక్రటరీ గౌరుగొండ అశోక్, సభ్యులు శ్రీనివాస్, నాగొండ, ఈరుగొండ, గంగాధర్, శేఖర్, ప్రకాశ్, సుధాకర్‌తో పాటు సంఘం యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
