- ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి
నందిపేట్, బతుకమ్మ : గణేశుని పండగను ఎలా శాంతియుతంగా, మరియు దిగ్విజయంగా జరుపుకోవాలని నందిపేట్ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ రూరల్ సీఐ కే. శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నందిపేట్ ఎస్ఐ శ్యామ్ రాజ్, ఎస్ఐ-2 రామ్ రాబోయే గణేష్ ఉత్సవాలు దృష్ట్యా, వెల్మల్ గణేష్ కమిటీ మెంబెర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గణేష్ విగ్రహం తీసుకొచ్చే సమయం లో జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదం జరగ కుండా చూడాలన్నారు. ప్రతి గణేష్ మండపం లో తప్పకుండ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా ” లౌడ్ స్పీకర్ల ” విషయంలో చాలా జాగ్రతలు వహించాలని తెలిపారు. పోలీసులకు సహకరించి శాంతి యుతంగా నిర్వహించుకోవాలని సూచించారు.

