28.8 C
Hyderabad
Monday, August 3, 2026

వరద పరిస్థితులపై ప్రత్యేక పర్యవేక్షణ

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : సాలూరా మండలం మంధర్నా గ్రామంలో వరద ముంపు పరిస్థితులు ఏర్పడడంతో తహసీల్దార్ శశిభూషణ్ చేరుకున్నారు. రాత్రి అంతా గ్రామస్థులతో కలిసి గడిపారు. వరద స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ప్రజలతో కలిసి భజన కార్యక్రమంలో పాల్గొని వారికి ధైర్యం చెప్పారు. వరద జాగ్రత్తలు సూచిస్తూ, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకరాలు అందిస్తామని భరోసా కల్పించారు. రాత్రి వర్షంలోనూ గ్రామానికి చేరుకొని ప్రజలతో మమేకమై, వారికి తోడుగా నిలిచిన తహసీల్దార్ కు  గ్రామస్థులు   కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article