. . అక్రమంగా తరలిస్తున్న దాన్యం లారీ పట్టివేత…
. . .పోలీసుల అదుపులో డ్రైవర్ ,క్లీనర్
బతుకమ్మ, బిర్కూర్ :
రైస్ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి దాన్యం కొనుగోలు చేసి వారికి మిల్లింగ్ చేయడానికి అప్పగిస్తే కొంతమంది రైస్ మిల్ యజమానులు దాన్యమును పక్కదారి పట్టించి కోట్లు గడిస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారుల పనితీరుపై మండిపడ్డారు. ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తే వారిపై కఠినంగా శిక్షించాలని, అంతేకాకుండా ఆ రైస్ మిల్లు బ్లాక్లిస్టులో పెట్టాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు , రైస్ మిల్లుల యజమానులతో కుమ్మక్కై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయల ధాన్యం బయట మార్కెట్ కు వెళ్ళిపోయింది. సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం కూర్ల గ్రామం లోని ఓ రైస్మిల్ యజమాని అక్రమంగా ధాన్యం ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం కు తరలిస్తుండగా బీర్కూరులో పోలీసులు పట్టుకున్నారు. ఈ ధాన్యమునకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, వే బిల్లులు లేకపోవడంతో డ్రైవర్, క్లీనర్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ లారీల్లో 650 నుంచి 750 వరకు ధాన్యం బస్తాలు ఉన్నట్లు తెలుస్తుంది. అక్రమంగా ధాన్యమును తరలిస్తున్న రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు విషయంను అధికారులు నిర్ధారించలేదు..
