27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వినాయక్ నగర్ లో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

  • 12తులాల బంగారం, 30తులాల వెండి అపహరణ

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వినాయక్ నగర్ లోని నాగ టవర్ లో గల ఫ్లాట్ నెం.102 లో శనివారం రాత్రి చోరీ జరిగినట్లు నాలుగో టౌన్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. దేవసాని విట్టల్ కుంటుబ సభ్యులు వినాయక్ నగర్ లోని నాగ టవర్ లోని 102 ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి తన ఫ్లాట్ లోని ఒక బెడ్ రూంలో నిద్రిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రెండో బెడ్ రూం కిటికీలోకి చొరబడి 12తులాల బంగారం, 30తులాల వెండి చోరీకి పాల్పడ్డారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article