27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎక్కడ చూసినా హరే కృష్ణ హరే హరే జపం

Must read

📰 Generate e-Paper Clip

  • ఘనంగా శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను గ్రామ కమిటీలు,ప్రజల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి (గోకులాష్టమి) పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై కృష్ణ నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.పండుగలో భాగంగా కృష్ణ భక్తి మనసును పవిత్రం చేస్తుంది” “గోపాలుడి కరుణ లభిస్తే జీవితం సాఫల్యం అవుతుందనే  భావంతో” గ్రామాలలో మొత్తం పండుగ శోభతో నిండిపోయింది.గ్రామాలలో వర్షాలు  సకాలంలో సమృద్ధిగా కురిసి, పాడిపంటలతో పాట, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విరజిల్లాలని పూజలు నిర్వహించి ఉట్టి కొట్టడం ప్రారంభించారు.అనంతరం యువకులు ఒకరిపై ఒకరు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ రేపుతూ పోటాపోటీగా ఉట్టి కొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఉట్టి కొట్టే ప్రయత్నంలో క్షణం క్షణం నువ్వా నేనా అన్నట్లుగా ప్రాంగణం అంతా ఒక్కసారిగా రసవత్తరంగా మారింది.ఉట్టి కొట్టే ప్రాంగణంలో  స్థానిక ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో  పోలీసు బందోబస్తును నిర్వహించారు. పలు గ్రామాలలో ఇంకా ముట్టికొట్టే పోటీలు జరుగుతూ ఉన్నాయి.ఈ కార్యక్రమంలో గ్రామభివృద్ధి కమిటీలు, యువకులు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article