- స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి షురూ..!
- వార్డుల వారిగా ఓటర్ జాబితాలు సిద్ధం చేసిన అధికారులు..?
- మూడు పార్టీలోనూ నాయకుల సమన్వయలోపం..?
ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ ప్రకటించక ముందే ఎన్నికల వేడి రోజుకు వేడెక్కుతుంది. వివరాలలోకి వెళితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తోంది. రాష్ట్రంలో 6 గ్యారంటీ ల హామీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.హామీలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో పథకాలు గడపగడపకు తీసుకెళ్లి వివరించె ప్రయత్నాలు చేస్తుంది.స్థానిక సంస్థలలో భారీ మెజార్టీలతో విజయం సాధించాలని అధికార పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను, పార్టీ క్యాడర్ను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది.
బిజెపి పార్టీ సైతం పార్టీ సీనియర్ నాయకుల నుండి, పార్టీ క్యాడర్ వరకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోందనీ ప్రచారం కొనసాగుతోంది. మరో పక్క బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో గతంలో జరిగిన ఎంపీ ఎన్నికలలో పుంజుకొని సీట్లు సాధించడంతోపాటు నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు ఏర్పాటు చేసినందున ప్రజలలోకి రైతులలోకి నేరుగా తీసుకెళ్లాలని నాయకులకు కార్యకర్తలకు సూచిస్తుంది.అలాగే కేంద్రం నుండి వచ్చే నిధుల కొరకు క్రింది స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు గ్రామ రైతులకు గ్రామస్థాయి క్యాడర్ కు వివరించాలని భావిస్తుంది.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించాలని నాయకులను అప్రమత్తం చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో గత 9 సంవత్సరాలు చేసిన పాలనలో భాగంగా అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాణాలికలు చేస్తున్నట్లు వినికిడి.కాంగ్రెస్,బిజెపి పార్టీల బలహీనతలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తుందని అక్కడక్కడ చర్చించుకుంటున్నట్లు వినికిడి, సర్పంచ్,జెడ్పి,జడ్పిటిసి,ఎంపీపీ పీఠాలపైన పాగ వేయాలని చూస్తుందనీ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
- ఇప్పటికే ఓటర్ జాబితా వార్డుల వారీగా అధికారులు సిద్ధం..
ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుందని ఇప్పటినుండి ఆశవాహులు ముమ్మర ప్రయత్నాలు చేపడుతున్నారు.కాంగ్రెస్,బిజెపి, బీఆర్ఎస్ మూడు పార్టీలలోను నాయకుల పట్ల సమన్వయ లోపం ఉండడంతో ఎవరికి వారే యమున తీరమన్నట్లుగా భారీగా గుసగుసలు వినబడుతున్నాయి.మరికొందరు ఆశావాహులు వడ్డీలకు సైతం డబ్బులు తెచ్చుకొని సమకూర్చుకున్నట్లు వినికిడి.ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తంగా మారనున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ స్థాయిలో జరగనున్నాయో వేచి చూడాల్సిందే.
