29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అన్న మరణ వార్త విని తమ్ముని మృతి

Must read

📰 Generate e-Paper Clip

  • విషాదంలో అంక్సాపూర్ గ్రామం

 

వేల్పూర్, బతుకమ్మ : అన్నీ తానై చూసుకొనే తోడబుట్టిన అన్న మరణించాడన్న వార్త విన్న తమ్ముడికి హార్ట్ హెటాక్ వచ్చి మృతి చెందిన ఘటన మండలంలోని అంక్సాపూర్ గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంక్సాపూర్ గ్రామానికి చెందిన భార్గవ్ అలియాస్ శ్యాం (57)అనే వ్యక్తి వృత్తిరీత్యా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో పని చేస్తున్నాడు. ఆకస్మాత్తుగా శ్యాం గుండె పోటుతో మరణించాడు. ఆ విషయాన్నీ శ్యాం సొంత గ్రామమైనా అంక్సాపూర్ కు నాగ్ పూర్ నుండి సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు మృతదేహన్ని గ్రామానికి తీసుకువస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అంక్సాపూర్ లోనే నివాసం ఉంటున్న మృతుడు శ్యాం తమ్ముడు విజయ్ కుమార్ కు తెలిసింది. అన్న మరణ వార్త విన్న తమ్ముడు విజయ్ కు హార్ట్ హేటాక్ వచ్చింది. చికిత్స నిమిత్తం స్థానికులు అంబులెన్సులో నిజామాబాద్ జి జి హెచ్ కు తరలించగా చికిత్స పొందుతూ తమ్ముడు విజయ్ మృతి చెందాడు. కుటుంబ కలహాల కారణంగా మృతుడు విజయ్ భార్య తల్లిగారి ఇంటికి వెళ్ళింది. గత కొద్దీ రోజులుగా ఒంటరిగా ఉంటున్న విజయ్ కు తన అన్న శ్యాం ఆర్ధికంగా చేదోడువాదోడుగా ఉండి ఆదుకొన్నాడు. తనకు అండగా ఉంది ఆదుకొంటున్న పెద్ద దిక్కు, తన తోడబుట్టిన అన్న మరణించడాన్ని జీర్ణించుకోలేని తమ్ముడు విజయ్ కూడా తన అన్నతో కలిసి అనంత లోకాలకు వెళ్ళాడు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు మరణించడం తో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకొన్నాయి. అన్న అంత్యక్రియలు మధ్యాహ్నం, తమ్ముని అంత్యక్రియలు సాయంత్రం నిర్వహించడం గ్రామస్థులను కలచివేసింది.

More articles

Latest article