బతుకమ్మ, మోర్తాడ్:
మోర్తాడ్ మండలంలోని డోన్ పాల్ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా రూ.500 కే ఎల్ పి జి సిలిండర్ పత్రాలను అర్హులకు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అందజేశారు. బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి చొరవతో దోన్ పాల్ గ్రామంలో 188 మందికి అర్హత పత్రాలు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
