- రాజంపేట శిశు మందిర్ పాఠశాలలో ఘటన
- చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలింపు
రాజంపేట, బతుకమ్మ : మూత్ర విసర్జనకు బయటకు వెళ్లిన ఓ విద్యార్థిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలై కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, విద్యార్థి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాజంపేట మండల కేంద్రంలోని శ్రీ శారద శిశు మందిర్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి ధనుంజయ్ (4) మూత్ర విసర్జనకు వెళ్ళాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన వీధి కుక్కలు ఒకసారిగా బాలుడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు.

విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది కుక్కలను తరిమే ప్రయత్నం చేయగా ఉపాధ్యాయురాలు పై సైతం దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన ధనుంజయ్ ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థితో పాటు మరో ఇద్దరికి సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా గ్రామంలో వీది కుక్కలు సైర విహారం చేస్తున్నాయని గ్రామపంచాయతీ పట్టించకపోవడం వలన ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ పలువురు పెద్దలు చిన్నలకు గాయాలపాయలైనప్పటికిని అధికారులు స్పందించడంలో విఫలమయ్యారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్ వివరణ కోరగా గతంలోని వీధి కుక్కలను పట్టుకోవడం జరిగిందని ప్రత్యేక కార్యక్రమం ద్వారా రెండు రోజుల్లో గ్రామంలోని వీధి కుక్కలను పట్టే ప్రయత్నం చేస్తామని అన్నారు.
