29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

గంజాయి విక్రేతను అరెస్టు చేసిన అబ్కారీ పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

  • నాలుగు కిలోల ఎండు గంజాయి స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ఓ స్వప్న ఆధ్వర్యంలో గంజాయి విక్రేతను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. గురువారం విశ్వసనీయమైన సమాచారంతో అసద్ బాబా నగర్ లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇర్పాన్, షేక్ అక్రం లు గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు చేశారు.  ఈ తనిఖీలలో షేక్ అక్రం ను అరెస్టు చేసి 4 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. షేక్ ఇర్పాన్ పరారీలో ఉన్నడని త్వరలో పట్టుకుంటామని ఎక్సైజ్ సిఐ స్వప్న తెలిపారు. ఈ తనిఖీలలో ఎస్ఐ మల్లేష్, సిబ్బంది సునీల్, షబ్బిర్, ధర్ సింగ్, సంజయ్, సుచరితలు పాల్గొన్నారు.

More articles

Latest article