26.3 C
Hyderabad
Monday, August 3, 2026

హర్ ఘర్ తిరంగా జాతీయ ఐక్యతకు ప్రతీక

Must read

📰 Generate e-Paper Clip

  • బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుంచి తిలక్ శాస్రి చౌరస్తా వరకు దేశభక్తి జెండాలతో, నినాదాలతో, భారీ ఎత్తున యువత పాల్గొన్న హర్ గర్ తిరంగా ర్యాలీ అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై, యువతలో దేశభక్తి జ్వాల రగిలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ గౌరవం కోసం ఎప్పుడూ ముందుండి పోరాడే, మాట ఇచ్చినదాన్ని కార్యరూపం దించే మహానాయకుడు. ఆపరేషన్ సిందూర్ వంటి చారిత్రాత్మక రక్షణ చర్యల ద్వారా భారత సైన్యం శౌర్యం, భారత నాయకత్వం ఎంత దృఢంగా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్పారు. సరిహద్దుల వద్ద శత్రువుల కుతంత్రాలను ఛేదిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే సాహసాన్ని మోదీ గారి నాయకత్వం మరింత బలోపేతం చేసింది. ‘హర్ గర్ తిరంగా’ కేవలం పతాక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది మన జాతి గౌరవం, స్వాతంత్ర్య స్ఫూర్తి, త్యాగాలకు ప్రతీక” అని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్ల భారత్ ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతోంది. ఆయన ఆపరేషన్ సిందూర్ వంటి సాహసోపేతమైన చర్యలతో దేశ శత్రువులకు గట్టి హెచ్చరిక పంపారు. యువతలో దేశభక్తి, జాతీయ పతాకం పట్ల గౌరవం పెంపొందించడం ఈ ర్యాలీల ప్రధాన లక్ష్యం. మనందరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకొని, పతాకాన్ని ఎగురవేయడం ద్వారా దేశ గౌరవాన్ని కాపాడాలి” అని పిలుపునిచ్చారు.ఆగస్టు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ గర్ తిరంగా ర్యాలీలు, పతాక యాత్రలు, అవగాహన కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని, ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయం, ప్రతి వీధి జాతీయ పతాకాలతో ముస్తాబవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ర్యాలీలో యువత ‘వందే మాతరం’, ‘భారత్ మాతా కి జై నినాదాలతో నగరాన్ని మార్మోగించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు పోతంకర్ లక్ష్మి నారాయణ, న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, మాజీ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, హర్ గర్ తిరంగా కో కన్వీనర్ రాం చందర్, అమందు విజయ్ కృష్ణ,రనదీష్,  యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షులు పంచారెడ్డి ప్రవళిక  కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.

Har Ghar Tiranga is a symbol of national unity

More articles

Latest article