27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ముప్కాల్ లో గ్యాంగ్ అఫ్ గోపాల్ పేట్ సినిమా షూటింగ్

Must read

📰 Generate e-Paper Clip

బాల్కొండ, బతుకమ్మ : రీల్ రియల్ మూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న గ్యాంగ్ అఫ్ గోపాల్ పేట్ సినిమా ఆదివారం రాత్రి ముప్కాల్ మండల కేంద్రంలో ప్రారంభమైంది. మండల కేంద్రం సమీపంలోని పడిలేచిన మర్రిచెట్టు దేవస్థానం వద్ద సినిమా నిర్మాత శ్రీఫనీంద్ర ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం టీ ఎస్ యు టీ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓ. రమేష్ క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు.తెలంగాణ గేయ రచయిత కోదారి శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మధు మల్లం వైవీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో నూతన నటినటులతో, యువతకు స్ఫూర్తిగా నిలిచే కథతో ఈ ప్రాంతంలోని గ్రామాల్లోనే నిర్మిస్తున్నట్లు డైరెక్టర్ మధు మల్లం వైవీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండురంగ బుక్స్ డిస్టిబ్యూటర్ అధినేతలు రాంరాజ్, ఉమేష్, స్టూడియో శ్రీనివాస్, దశరథ్, ఆనంద్ గౌడ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Gang of Gopal Pate movie shooting in Mupkal

More articles

Latest article