26.2 C
Hyderabad
Monday, August 3, 2026

గంజాయి, డ్రగ్స్, గుట్కా, మత్తు పదార్థాలను నిషేధించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పీవైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొంకటి ఆశిష్

 

సిరికొండ, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా యువత గంజాయి, డ్రగ్స్, గుట్కా ఇతర మత్తు పదార్థాలకు బానిసై వారి జీవితాలు నాశనం చేసుకొంటున్నారని, అట్టి గంజాయి, డ్రగ్స్, గుట్కా, ఇతర మత్తు పదార్థాలను అరికట్టాలని పీ వై ఎల్ స్టేట్ కమిటీ మెంబర్ కొంకటి ఆశీష్ కోరారు. ఈ మేరకు సిరికొండ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, స్థానిక ఎస్సైకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి, మాఫియా విచ్చలవిడిగా గ్రామాలను సైతం వదలకుండా చదువుకునే విద్యార్థుల నుండి వృద్ధులను వదలకుండా మత్తుకు అలవాటు చేస్తున్నారన్నారు. దీనితో వారి కుటుంబం జీవితాలు చిన్నభిన్నం అవుతున్నాయని,  నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు.మండలంలో క్రమంగా విస్తరిస్తున్నాయని,  వీటిని  అరికట్టడానికి ఇప్పటికే  ఎస్ ఐ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇంకా సంబంధిత శాఖలు, ప్రభుత్వ  ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వీటిని వెంటనే అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ సిరికొండ మండల సభ్యులు బి.అక్షయ్, ఎం.ప్రణీత్, పండరి, నరేష్, సుమన్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article