25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రక్తదానానికి యువత ముందుకు రావాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి అధ్యాపకుల విద్యార్థుల సహకారంతో కాలేజీ పూర్వ విద్యార్థి కీర్తిశేషులు జెర్సీ బాల్రాజ్ గౌడ్ జ్ఞాపకార్థం కాలేజ్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. అవసరమన్న వారికి ఆపదలో రక్త దానం చేసి ప్రాణాలు కాపాడాలని, ముఖ్యంగా యువత రక్తదానం చేయడానికి  ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రక్తదాన విషయంలో రాష్ట్రంలోనే ముందుండాలని అన్నారు. మన జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా రక్తాన్ని అందిస్తున్నామని,  మన జిల్లాలోని జిల్లా అధికారులు, సిబ్బంది తప్పకుండా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని ప్రతి ప్రజావాణిలో కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న, కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధులు రఘుకుమార్, దస్థిరం, నరసింహం, రమేష్ రెడ్డి,  కాలేజీ అధ్యాపకులు శ్రీనివాస్ రావు, సుధాకర్,  కీర్తిశేషులు బాలరాజు భార్య, పిల్లలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article