26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కి బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసత్యాలు మాట్లాడారని అందులో పేర్కొన్నారు. రాజకీయ ఉనికి కోసమే ఒక ప్రజా ప్రతినిధి పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు లోను అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

More articles

Latest article