29 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చాటిన జిల్లా వాసులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ఈనెల 14 -15న సరూర్నగర్ హైదరాబాద్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇండోర్ స్టేడియంలో జరిగిన 11 వ ఇంటర్ జిల్లా యోగాసనా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో జిల్లా తరఫున 32 మంది పాల్గొన్నారని యోగా సంఘం ప్రతినిధి ఐశ్వర్య కాలే అన్నారు. ఈ పోటీలలో 08-10సంవత్సరాల బాలుర విభాగం లో అన్షుల్ బంగారు పతకం సాధించినట్లు ఆమె తెలిపారు. 08-10 బాలికల విభాగంలో పి.దీక్షిత 16-18 అమ్మాయిల విభాగంలో కే. శ్రీనిధి, 45 సంవత్సరాలు పైబడిన పురుషుల విభాగంలో ఆర్ రఘు కాంస్య పతకం , 12 -14 బాలికల విభాగంలో డి. స్మైత్రికా చారి 4వ స్థానం, 14-16 బాలుర విభాగంలో బి. వర్షిత్ 6వ స్థానంలో నిలిచారని అన్నారు. గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను యోగా సంఘం ప్రతినిధి ఐశ్వర్య కాలే, ప్రధాన కార్యదర్శి గంగాధర్ యోగ సంఘం సభ్యులు అభినందించారు. వీరు అక్టోబర్ నెలలో 24 – 28 తేదీనన హిమాచల్ ప్రదేశ్ లో జరిగే 48వ జాతీయస్థాయి యోగాసన పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు.

More articles

Latest article