23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

గ్రామాల్లో ఘనంగా శోభాయాత్ర

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ మోర్తాడ్:  గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించి ప్రతి నిత్యం రకరకాల నైవేద్యాలతో, హారతులతో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు నిమజ్జన కార్యక్రమాన్ని సైతం ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు శేట్ పల్లీ, దొనకల్, ధర్మోరా, పాలెం, తిమ్మాపూర్, తదితర గ్రామాల్లోని యువజన సంఘాల సభ్యులు గణేష్ ప్రతిమలను గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా రంగ రంగ వైభవంగా ఊరేగింపును నిర్వహిస్తూ చిన్న,పెద్ద తేడా లేకుండా అందరు డ్యాన్సులతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. చివరకు గ్రామాల్లో ఉన్న ఊర చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article