26.6 C
Hyderabad
Monday, August 3, 2026

గాండ్ల పట్టణ సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ పట్టణ గాండ్ల సంఘ ప్రమాణ స్వీకారాని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై నూతనంగా ఎన్నుకున్న గాండ్ల సంఘ అధ్యక్షులు, సంఘ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కుల సంఘాల ఎలక్షన్లు జరుగుతున్నాయి అంటే ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతున్నట్లు ఉన్నాయని అనారు. ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. నిజామాబాద్ అన్ని కుల సంఘాల్లో ముందుండేది గాండ్ల సంఘం అని, ఇతర సంఘాలకు ఆదర్శంగా గాండ్ల సంఘం నిలుస్తుందని అన్నారు. నిజామాబాద్ లో బోనాల పండుగ చాలా అద్భుతంగా చేస్తారని తెలిపారు. గాండ్ల సంఘం కి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు బాసోల్ల నాగరాజ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్, పీసీసీ స్టేట్ సెక్రెటరీ రాంభోపాల్, నరాల రత్నాకర్, కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Gandla Town Council new governing body swearing-in ceremony

More articles

Latest article