- ఎస్సై కె. సందీప్
భీమ్ గల్, బతుకమ్మ : నవ సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర యువకులదని అలాంటి యువత మత్తుకు బానిసలు కాకుండా మత్తును వీడాలని ఎస్సై కె. సందీప్ అన్నారు. శుక్రవారం సీ పీ ఆదేశానుసారం మండలంలోని బాబాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ హల్ లో యువతకు మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ నేరాలపై అవేర్నస్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మేం బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని చెప్పి మీ అకౌంట్ ప్రాబ్లమ్ లో ఉందని చెప్పి అందుకోసం మీ ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, డీటెయిల్స్ పెట్టండి అని కాల్ చేస్తే అస్సలు నమ్మొద్దని ఆయన తెలిపారు.మీకు బ్యాంక్ సమస్య ఉందని ఎవరన్నా కాల్ చేస్తే మీరే నేరంగా బ్యాంకు వెళ్లి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే గంజాయి, మత్తుప దార్థాలు లేని సమాజం నిర్మించేందుకు యువత సహకరించాలని ఎస్సై అన్నారు. డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లు బారిన పడడం ద్వారా కలిగే చెడును విషయాల పై ఎవరైనా మత్తు పదార్థాల ను విక్రయించినా, వాటిని అలవాటు చేసుకోవాలని ఒత్తిడి చేసినా స్థానిక పోలీసులకు లేదా 1908 నెంబరు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలకు ఎస్సై కోరారు.అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన పెట్టడం చాలా సంతోషకరమని అన్నారు. ఇలాంటి విషయాలపై గ్రామస్తులకు అవగాహన కొరకు వచ్చి ఇంతటి సందేశాన చేస్తున్న ఎస్సై కే.సందీప్ ప్రత్యేక ధన్యవాదాలు.యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నిత్యజీవితం పాడుగాకుండా పోలీస్ శాఖ వారు తెలిపినట్టుగా తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ చూపి రాత్రి సమయంలో పిల్లలు ఇంటికి రాకపోవడం ఇంటికి లేట్ రావడం ఇలాంటి విషయాలపై తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ చూపాలని అన్నారు.
