27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో

 

రుద్రూర్, బతుకమ్మ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఐఎల్ ఆర్ గది, ల్యాబోరేటరీ గది, స్త్రీల వార్డు, మెయిన్ డ్రగ్ స్టోర్, ప్రసూతి గదులను పరిశీలించి, ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఎమైనా సమస్యలు ఉన్నాయా అని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓపికతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. సబ్ కలెక్టర్ వెంట వైద్యాధికారిణి డాక్టర్ అయోషా సిద్దిఖ, సూపర్ వైజర్ రవి, ల్యాబ్ టెక్నీషియన్ తరుణ్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

Provide better medical services to patients

More articles

Latest article