25.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం.. మహిళకు తీవ్ర గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగి రెండు రోజులైనా ఆర్టీసీ ఇన్స్పెక్టర్ డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లలేదు. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఏపీ, 25,జడ్ 0018 నెంబర్ గల బస్సు మెదక్ నుండి కామారెడ్డి డిపోకు వస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన సాకలి విజయ కొండాపూర్ గ్రామం నుండి  చిన్న మల్లారెడ్డి గ్రామానికి వెళ్తుంది. బస్సు ఎక్కి టికెట్ కూడా తీసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో కండక్టర్ సీటు వెనకాల నిలబడ్డ విజయ ఒకేసారి బస్సు మెట్లపై పడి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ఉన్న వారి గ్రామస్తులు బస్ క్రింద పడకుండా చూడడం పట్టుకున్నారు. వారి గ్రామస్తులు తనకు తెలపడంతో వచ్చి అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకు వచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్కు తీసుక వెళ్లాలని చెప్పడంతో, అఖిల హాస్పిటల్కు తీసుకురడం జరిగిందని విజయ కొడుకు సూరజ్  తెలిపారు. ఈ విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లడానికి వెళుతున్న తమని వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, ఇంత ఘోరమైన పరిస్థితి ఎవరికి కూడా రావద్దని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్ కండక్టర్ పైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

RTC bus driver's negligence... Woman seriously injured

More articles

Latest article