ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం.. మహిళకు తీవ్ర గాయాలు
కామారెడ్డి, బతుకమ్మ : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగి రెండు రోజులైనా ఆర్టీసీ ఇన్స్పెక్టర్ డిపో మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లలేదు. కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఏపీ, 25,జడ్ 0018 నెంబర్ గల బస్సు మెదక్ నుండి కామారెడ్డి డిపోకు వస్తుండగా కొండాపూర్ గ్రామానికి చెందిన సాకలి విజయ కొండాపూర్ గ్రామం నుండి చిన్న మల్లారెడ్డి గ్రామానికి వెళ్తుంది. బస్సు ఎక్కి టికెట్ కూడా తీసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్...