24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఉపాధ్యాయుల దీర్ఘకాల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదు

Must read

📰 Generate e-Paper Clip

  •  టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యు ఎస్ పి సి ఉపాధ్యాయ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి గైని గంగారం విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాను ప్రారంభిస్తూ గైని గంగారంమాట్లాడుతూ 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయి ఇతర జిల్లాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సొంత జిల్లాకు తీసుకు రావడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేనప్పటికీ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ 317 జీవో బాధితులకు అన్యాయం చేయడం సరికాదని తక్షణమే ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. 2023 జూలై నుండి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పే రివిజన్ జరగవలసి ఉందని రెండేళ్లు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం పేరు రివిజన్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడంలేదని అమలు కొరకు చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని తక్షణమే పిఆర్సి రిపోర్ట్ తెప్పించుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు 40 శాతం ఫిట్మెంట్తో పిఆర్సి అమలు చేయాలని అన్నారు. దీర్ఘకాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులు మంజూరికి నోచుకోవడం లేదని తక్షణమే పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటిని ప్రభుత్వ హామిఇచ్చిన ప్రకారం చెల్లింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీజీ ఈ జేఏసీ చైర్మన్ నా శెట్టి సుమన్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ జీవో నెంబర్ 25 సవరించాలని ఈ జీవో ప్రకారం తరగతి ఒక ఉపాధ్యాయుడు ఉండే పరిస్థితి లేదని ఐదు తరగతులు ఉన్న అనేక పాఠశాలలో ఒకరిద్దరు మాత్రమే పనిచేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ విధానం ప్రభుత్వ విద్యను విధ్వంసం చేయడమే అవుతుందని తక్షణమే 25 జీవోను సవరించి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యlo పర్యవేక్షణ లేకుండా పోయిందని గత 30 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు నింపకపోవడం వల్ల ప్రభుత్వ విద్య నిర్లక్ష్యానికి గురవుతుందని తక్షణమే పర్యవేక్షణ అధికారులైన డిప్యూటీ డీఈవో ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్, యు ఆర్ ఎస్ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వీరి కి కనీస బేసిక్ పే ను అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శాపంగా ఉన్న సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వై.విజయ్ కుమార్, పి శoతన్, డి సత్యానంద్ లు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కోర్టు ఉత్తర్వులు ప్రకారం పాత పెన్షన్ విధానం తక్షణమే అమలు చేయాలని, ఏకీకృత సర్వీసులు సమస్యను పరిష్కరించి బదిలీ పదోన్నతుల కోడు రూపొందించి ప్రతి సంవత్సరం వేసవిలో బదిలీలు పదోన్నతులు నిర్వహించాలని తెలిపారు. వెనక జిల్లాలలో అర్హత లేని వారు డీఈవోలుగా పనిచేస్తున్నారని వారిని తక్షణమే తొలగించి అర్హతలు ఉన్న వారిని డీఈవోలుగా నియమించాలని, నూతన జిల్లాలకు డీఈవో పోస్టును ప్రతి రెవెన్యూ డివిజన్ కు డిప్యూటీ ఈవో పోస్టును నూతన మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని, బీఈడీ , డిఈడీ అర్హతలు ఉన్న ఎస్జీటీలు అందరికీ సీనియార్టీ ప్రకారం పిఎస్ హెచ్ఎం పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.  పాఠశాల అవసరాలకు కాకుండా వ్యక్తుల అవసరాలకు ఇస్తున్న పైరవీ డిప్యూటేషన్లు తక్షణమే రద్దు చేయాలని, 398 వేతనం పై పని చేసిన స్పెషల్ టీచర్ల సర్వీస్ కాలానికి ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని అన్నారు. అన్ని జిల్లాలకు సానిటేషన్ గ్రాంట్లు విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయినందున జీవో 2, 3, 9, 10 లను రద్దుచేసి జీవో 11 ,12 ప్రకారం ఎస్ జి టి/ ఎల్ పి/ పి ఈ టి లకు కామన్ సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, జూనియర్ లెక్చరర్ పదోన్నతుల్లో స్కూల్ అసిస్టెంట్లకు 40 శాతం వాటా పునరుద్ధరించాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు వేతనాన్ని వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా స్టేరింగ్ కమిటీ సభ్యులు. యం. బాలయ్య, ఓ రమేష్, సీహెచ్. సుధాo, విని గల సురేష్, ఒమాజీ, గంగాధర్, గోలి లింగన్న, అరవింద్, పి విజయ్ కుమార్, రాజారామ్, పోషన్న, పెంటన్న, ఓ, శ్రీనివాస్, గట్టు ఈశ్వర్, దేవసాయం, మారుతి, జనార్ధన్, తోపాటు వివిధ సంఘాల నాయకులు ఆల్ పెన్షనర్స్ రామ్మోహన్, ఈవిల్. నారాయణ, ఎల్. శ్రీధర్, సుధాకర్ గణేష్, కర్క గణేష్, తదితరులు ధర్నాను ఉద్దేశించి సంఘీభావం తెలియజేస్తూ మాట్లాడినారు.

The government's indifferent attitude towards the long-standing problems of teachers is wrong

More articles

Latest article