24 C
Hyderabad
Sunday, August 2, 2026

కంప్యూటర్ ల్యాబ్ కు ఫర్నిచర్ బహుకరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల కంప్యూటర్ ల్యాబ్ కోసం 25  కుర్చీలను”ఎగ్జిబిషన్ సొసైటీ” ప్రెసిడెంట్ బంటు రాజేశ్వర్, సొసైటీ సభ్యులు  అందించారు. ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణలోనే ఉత్తమ విద్యసంస్థగా నిలుస్తున్న జిజి కళాశాలలోనే చదువుకున్న పూర్వ విద్యార్థులుగా కళాశాల అభివృద్ధికి సహకారం అందించాలనే ప్రయత్నంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రామ్ మోహన్ రెడ్డి కోరిక మేరకు ఒక్కో కుర్చీ 2500/ – చొప్పున 25 కుర్చీలను  సోమవారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాలకు సహకారం అందించిన “ఎగ్జిబిషన్ సొసైటీ” వారికి ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలిపారు.  అధ్యాపకులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం, పూర్వ విద్యార్థుల సంఘం సమన్వయకర్త డా. దండు స్వామి, కంప్యూటర్స్ శాఖ అధిపతి కిరణ్ కుమార్ గౌడ్, డా. వివేకానంద, ఐక్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ డా. రాజేశ్, ఏ.ఓ. రామ్ కిషన్, సూపరిండెంట్ ఉదయ భాస్కర్, ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ డా. రామస్వామి, తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

Furniture donation for computer lab

More articles

Latest article