27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

చిగురించిన ఆశలు

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ :  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్  లో ప్రాజెక్టులో నీటిమట్టం 40 టీఎంసీలకు చేరుకోవడంతో స్థానిక నిజామాబాద్ జిల్లా రైతులు ఆశలు చిగురించాయి. లక్ష్మీ కాలువ ద్వారా బాల్కొండ నియోజకవర్గం లో 25 వేల ఎకరాలకు నీరు అందుతుంది. ప్రాజెక్ట్ నీటిమట్టం సగం నిండడంతో ఆయకట్టుకు నీరు అందుతుందని పంటలు పుష్కలంగా పండుతాయి అని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా మంగళవారం రోజు ప్రాజెక్టులో 1078.30 అడుగులు 40. 582 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

More articles

Latest article