నిజామాబాద్, బతుకమ్మ : ఈనెల 7న గోవా లో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభకు సంబంధించిన గోడ పత్రికను ఆదివారం జిల్లా కేంద్రంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా జిల్లా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం జాతీయ ఓబీసీ మహా సభలను నిర్వహిస్తారని అన్నారు. జాతీయ ఓబీసీ 10వ మహాసభలను ఆగస్టు 7న గోవాలో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% ఇవ్వాలనుకున్న రిజర్వేషన్లను కేంద్రం వెంటనే ఆమోదించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేదర్, చంద్రకాంత్, శ్రీలత, బగ్గలి అజయ్, బసవసాయి, సదానంద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
