26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర

Must read

📰 Generate e-Paper Clip

  • టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని, అధికారం పోవడంతో కేసీఆర్, కేటీఆర్ లకు నిద్ర పట్టడం లేదన్నారు. బనకచర్ల పాపం కేసీఆర్ దేనన్నారు. తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు అబద్దాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. త్వరలోనే తెలంగాణ యూనివర్సిటీలో వ్యవసాయ కాలేజి ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేవునిపేరుతో బీజేపీ నేతలు ఓట్లడుగుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ లక్షణాలు ఉన్నవారికే ఓట్లు వేయాలని సూచించారు. జనాభా ప్రాతిపధికన ఫలాలు అందలనేది రాహుల్ ఆకాంక్ష అని తెలిపారు. లక్కమ్ పల్లి సెజ్  ను పునరుద్దరిస్తామని పేర్కొన్నారు. కవిత ఏ పార్టీలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. బిసిలకు  కాంగ్రెస్ ఆర్డినెన్స్ తెస్తే ఆమె రంగులు పూసు కుంటోందన్నారు. మేము సమాలోచనలు చేసినపుడు కవిత జైలు లో ఉందన్నారు. జగిత్యాల వేములవాడ నిజామాబాద్ లను కలుపుతూ టెంపుల్స్ కారిడార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

More articles

Latest article