27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నిమ్స్ లో ఉచిత గుండె శస్త్ర చికిత్స క్యాంప్

Must read

📰 Generate e-Paper Clip

నిమ్స్ సూపరింటెండెంటెంట్ బీరప్ప

భీమ్ గల్, బతుకమ్మ: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఆపరేషన్లు అవసరమున్నపేదల కోసం నిమ్స్ లో ఉచిత గుండె ఆపరేషన్ల క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ బీరప్ప ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. లండన్ వైద్యుల సౌజన్యంతో నిమ్స్ కార్డియో థొరాసిక్ వింగ్ ఆధ్వర్యంలో క్యాంపు ఏడు రోజులపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న కార్డియక్ సర్జికల్ క్యాంపులో గుండె సంబంధిత వ్యాధులకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఆపరేషన్ అవసరం ఉన్నవారు  హార్ట్ సర్జికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకొవాలని ఆయన కోరారు.

 

More articles

Latest article