29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నేడు ఆర్మూర్ కు  మీనాక్షీ నటరాజన్

Must read

📰 Generate e-Paper Clip

  • పీసీసీ చీఫ్ తో కలిసి ఆలూర్ నుంచి ఆర్మూర్ వరకు పాదయాత్ర
  • 3న ఆర్మూర్ లో శ్రమదానం కార్యకర్తలతో సమావేశం

 

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జై బాపూ, జై భీం, జై సంవిదాన్ కార్యక్రమ అమలుతో పాటు స్థానిక ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు.  ఆరు రోజుల పాటు జరిగే మీనాక్షీ నటరాజన్ షెడ్యూల్ పరిగి అసెంబ్లీ  నియోజకవర్గంలో గురువారం ప్రారంభమైంది. శనివారం సాయంత్రానికి ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పాదయాత్ర చేస్తు ఆర్మూర్ చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి ఆర్మూర్ లో ఆదివారం ఉదయం శ్రమదానం చేయడంతో పాటు స్థానిక నాయకులతో సమావేశమౌతారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్, రాష్ట్ర పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటనల నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు చేసినట్టు డిసిసి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ సోసైటి చైర్మెన్ మానాల మోహన్ రెడ్డి తెలిపారు.

More articles

Latest article