27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నూతన గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: పాలెం గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో ఆదివారం నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లీ ఏఎంసీ చైర్మన్ పాలెపు నరసయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆనంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మహిపాల్, రంజిత్, నవీన్, పాలెం కాంగ్రెస్ నాయకులు ఏనుగు మోహన్, బ్రహ్మనాయుడు, రవిశంకర్, రాజన్న, నరేష్, గ్రామ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article