29 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రతి ఒక్కరు ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి తోడ్పడాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గెలుపొందిన ఆర్యవైశ్య సంఘం (పట్టణ) అనుబంధ సంస్థల అధ్యక్ష, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి తోడ్పడాలని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలో శ్రీరామ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం పట్టణ, అనుబంధ విజయోత్సవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా అర్బన్  ధన్పాల్ సూర్యనారాయణ  గుప్తా, మాజీ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘ (పట్టణ), అనుబంధ సంస్థలలో గెలుపొందిన కమిటీ సభ్యులకు పేరుపేరునా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ అనుబంధ ఎన్నికలలో ఎన్నో ఆటుపోటులు ఎదురయ్యాయి కానీ ధర్మ విజయం సాధించిందన్నారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు కొంతమంది సంఘానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆర్యవైశ్య సంఘానికి చెడ్డ పేరు రాకుండా గెలుపొందిన ప్రతి  ఆర్యవైశ్య పట్టణ అనుబంధ సంస్థలు సభ్యులు కృషి చేయాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో ఆర్యవైశ్య సంఘానికి ఎల్లప్పుడు తన వంతు  సహాయక సహకారాలు అందిస్తానన్నారు. కానీ రాజకీయంగా ఆర్యవైశ్యులు వెనుకబడి ఉన్నారని అన్నారు.

Everyone should contribute to the development of the Arya Vaishya Sangha.

More articles

Latest article