28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వీడీసీ కమిటీలు హద్దులు దాటొద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ

 

ఏర్గట్ల, బతుకమ్మ : వీడీసీ కమిటీలు హద్దులు దాటి చర్యలు చేపడతే, చట్టం తన పని అది చేస్తూ వెళ్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ అన్నారు. ఏర్గట్ల, మోర్తాడ్ మండలంలో గ్రామ అభివృద్ధి కమిటీల పై గ్రామ ప్రజలకు న్యాయ విజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల వలన గ్రామ ప్రజలకు అనేక సమస్యలకు, అతిగా బహిష్కరణలు , జరిమానాలు వంటి అంశాలు ప్రజల్లో ఎంతో దుఃఖాన్ని కలిగించే విధంగా చేస్తున్నాయన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, వీడీసీలు ఏ రాజ్యాంగం ద్వారా వారు వేధించే హక్కులు ఉన్నాయని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు మాత్రమేనా ఈ బహిష్కరణలు,  వీడీసీ లు అంటే ఇతర ప్రజలు సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని సూచించారు.  వీడీసీ లు ఇప్పటికీ ఐన మారాలని హెచ్చరించారు.

VDC committees should not cross the line

జిల్లా పోలీసు కమిషనర్   పి. సాయి చైతన్య మాట్లాడుతూ  వీడీసీ సభ్యులకు వారు చేసే అక్రమాలను అదుపులో ఉంచుకోవాలని లేదా మీ యొక్క కుటుంబాల నుండి ఉద్యోగ రీత్యా పొరుగు దేశాలకు వెళ్లడానికి అనుమతులు ఇవ్వకుండా పాసుపోర్టు లను రద్దు చేస్తామని హెచ్చరించారు. అనేక రకాల చర్యలు తీసుకుంటూ, కేసులు కూడా తప్పవని తెలిపారు. వీడీసీ లు అంటే మంచిని గ్రహించి, గ్రామ అభివృద్ధి కోసం పనులు చేయాలి కానీ అందులో ఉన్న చెడును ఉపయోగించి ప్రజలకు ఇబ్బందులు చేయరాదు అని చెప్పారు. ఏది ఏమైనా ఇక నుండి వీడీసీలపై ఎలాంటి వివాదాలైన కేసులైన మా వద్దకు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. మహిళలు కూడా వీడీసీ ల అధ్యక్షతను వహించి, మంచి కోసం ఉపయోగపడే ల ఉండాలని, అందరికి చట్టాలు అవగాహన ఉండాలని తెలిపారు. జిల్లా జడ్జి, పోలీస్ కమీషనర్ ముందుగా ఎస్సీ మాల సంఘం, గౌడ్ సంఘముల యొక్క గ్రామ అభివృద్ధి కమిటీల వల్ల బహిష్కరింపబడిన వారిని కలిసి , వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ కం సెక్రటరీ డీఎల్ఎస్ఏ  నిజామాబాద్, జ్యూడిషియల్ ఆఫీసర్ ఆర్మూర్ జి.ఉదయ్ భాస్కరరావు, స్టేట్ బార్ కౌన్సిల్ నిజామాబాద్ రాజేందర్ రెడ్డి , ఆర్మూర్ ఏసిపి వెంకట్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్మూర్ వివేకానంద రెడ్డి, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

VDC committees should not cross the line

More articles

Latest article