- రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
మోపాల్/కాల్పోల్, బతుకమ్మ : పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే కాలానుగుణంగా వ్యాధులు నుండి తప్పించుకోవచ్చని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ప్రజలు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నరాని విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి శనివారం డెంగ్యూ జ్వరం సోకిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాల్పోల్ గ్రామంలో వాడ వాడ, ఇంటింటికి తిరుగుతూ డెంగ్యూ సోకిన బాధితులను పరామర్శిస్తూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే జలుబు, సాధారణ జ్వరం,మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ప్రతి రోజు రోజువారి దినచర్యలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో రోడ్ల పైన మురుకు నీరు నిలుస్తుందని, దీనివల్ల దోమలు వ్యాప్తి చెంది ప్రజలకు సీజన్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. దోమలు రాకుండా

ఇండ్లలోని మంచినీటి తొట్టెలలో మీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈగలు దోమలు ముసరకుండా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమ తెరలను తప్పనిసరిగా ఉపయోగించాలని, గ్రామంలో మురుకు నీరు నిల్వ ఉండకుండా లార్వా పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తాగే నీటిని కాల్చి చల్లార్చిన తర్వాత తాగాలని, శుభ్రమైన ఆహారాన్ని తీసుకొని జాగ్రత్త పాటించాలని అన్నారు.కాల్పోల్ గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు డాక్టర్లు, సిబ్బంది పని చేస్తున్నారని అన్నారు. ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే డాక్టర్ల సలహా తీసుకోవాలని అన్నారు. డెంగ్యూ వ్యాధి బారినపడిన బాధితులకు కొన్ని జాగ్రత్తలు ఎమ్మెల్యే సూచించారు. ఈ పర్యటనలో డి ఎం హెచ్ ఓ రాజశ్రీ, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ రాథోడ్,మోపాల్ మండల ఎంపీడీవో, ఏఎంసీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, పిసిసి డెలికేట్ శేఖర్ గౌడ్, మోపాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయి రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు యాదగిరి, ప్రతాప్ నాయక్, బార్మాల్ నాయక్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

