- గుండ్ల వాగు లోలెవెల్ బ్రిడ్జి పై నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వర్షపు నీరు
రుద్రూర్, బతుకమ్మ : గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే గుండ్ల వాగు వర్షపు నీటితో నిండిపోయి లోలెవెల్ బ్రిడ్జి పై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండ్ల వాగు లోలెవెల్ బ్రిడ్జిని శనివారం తహసీల్దార్ తారాబాయి, ఎస్సై సాయన్న సందర్శించారు. కురుస్తున్న వర్షానికి లోలెవెల్ బ్రిడ్జి పైనుండి వర్షపు నీరు ఉదృతంగా ప్రవహించడంతో రుద్రూర్- బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి పై భారీ కెట్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జి పైనుండి నీరు ప్రవహించడంతో ఈ మార్గంకుండా రాకపోకలు కొనసాగించవద్దని, వేరే మార్గం గుండా వెళ్లాలని సూచించారు. అలాగే కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదని, చేపల వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

