24.7 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యుత్ షాక్ తో రైతు మృతి

Must read

📰 Generate e-Paper Clip

  • భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు

 

భీమ్ గల్, బతుకమ్మ : తన వ్యవసాయ క్షేత్రంలో ఒడ్ల మీద గడ్డి కొద్దామని గ్రాస్ కట్టర్ తీసుకొని వెళ్లిన రైతు గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైర్ కట్ కాగా విద్యుత్ షాక్ తగిలి ఆ రైతు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని రహత్ నగర్ లో ఓ కుటుంబంలో విశాదాన్ని నింపింది. మృతిని భార్య ఫిర్యాదు మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రహత్ నగర్ కు చెందిన ధారవత్ రాం సింగ్ (45) శుక్రవారం ఉదయం 9.30 ప్రాంతంలో గ్రామ శివారులో గల తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఒడ్లకు గడ్డి కోసేందుకు గ్రాస్ కట్టర్ ను తీసుకొని వెళ్ళాడు. గ్రాస్ కట్టర్ తో రాంసింగ్ గడ్డి కోస్తూ ఉండగా పొరపాటున తన బోర్ మోటర్ విద్యుత్ వైర్ కట్ అయ్యింది. ఆ విద్యుత్ తీగ కట్ కాగా కరెంట్ షాక్ తగిలి రాం సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ మేరకు మృతుని భార్య ధారవత్ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రాంభించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. సంఘటన స్థలం వద్ద పంచానామా నిర్వహించిన పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article