27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టడానికి బీఆర్ఎస్ కుట్ర

Must read

📰 Generate e-Paper Clip

  • డిసిసి అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ధ్వజం

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో విద్వేషాలు అల్లర్లు సృష్టించడానికి బీఆర్ఎస్ పార్టీ పోరంబోకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రూపంలో రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారనిడిసిసి అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్మానాల మోహన్ రెడ్డిధ్వజమెత్తారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పోరంబోకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు ఆ పార్టీ నాయకత్వం నాయకులు యత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు ఎన్ని కుట్రలు పన్నిన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలను ఎవరు ఆపలేరనిఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుపుకుపోతూ ఉన్నారని ఆయన అన్నారు. ఇది గిట్టనిమాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి కౌశిక్ రెడ్డి రూపంలో ఆయనను రెచ్చగొడుతూ రాష్ట్రంలో అలజల్లులకు ప్రోత్సహిస్తున్నారనిఆయన అన్నారు.ఎన్ని కుట్రలు పండిన కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలనుఎవరు ఆపలేరనిఅయినా అన్నారు. అదేవిధంగా ఈనెల 15న హైదరాబాద్లో టిపిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ కార్యక్రమానికి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు హైదరాబాద్ కు తరలిరావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, ఎన్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, డిసిసి డెలికేట్ లవంగం ప్రమోద్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర సెక్రటరీ విపుల్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షులు ప్రీతం తదితరులుపాల్గొన్నారు.

More articles

Latest article